కరోనా ఎఫెక్ట్: హాంకాంగ్ కు విమాన సర్వీసులు నిలిపివేయాలని ఎయిరిండియా నిర్ణయం

  • చైనా, పొరుగు ప్రాంతాల్లో కరోనా విజృంభణ
  • విమాన సర్వీసులు తగ్గిస్తున్న విమానయాన సంస్థలు
  • అదేబాటలో ఎయిరిండియా
చైనా ప్రధాన భూభాగం, దాని అధీన ప్రాంతాల్లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొంటున్నాయి. క్రమంగా ఇతర దేశాల్లోనూ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు ఇతర దేశాల ప్రయాణికుల రాకపోకలు బాగా తగ్గిపోయాయి.

 ఇప్పటికే పలు విమానయాన సంస్థలకు చైనా, దాని పొరుగున ఉన్న తైవాన్, హాంకాంగ్ లకు విమానసర్వీసులను తగ్గించాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా హాంకాంగ్ కు విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 8 నుంచి హాంకాంగ్ కు విమానాలు నడపరాదని నిశ్చయించుకుంది. ఫిబ్రవరి 7న నడిపే ఏఐ314 సర్వీసే హాంకాంగ్ కు ఎయిరిండియా నడిపే చివరి సర్వీసు కానుంది.
Go Back to Shorts
Airindia
HongKong
Corona Virus
China
India

More Telugu News